ఎస్టీ ఎస్టీ విభాగాలకు చెందిన నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీచేసింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే.
ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జస్టిస్ భట్టి, జస్టిస్ అమానుతుల్లాలతో కూడిన ధర్మాసనం సుధీర్ఘంగా వాదనలు ఆలకించిన తర్వాత గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే, ఈ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ను పూర్తి చేసినట్టుగా ఉందని మండిపడింది.