మంత్రివర్గ విస్తరణ సమయంలో తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన వ్యాఖ్యలను టీవీలు బాగా చూపించాయి. కాపుల గొంతు కోశారు అంటూ సెల్ ఫోనును దగ్గర పెట్టుకుని ఆయన అన్నారు. కేశినేని ప్రక్కనే వున్నప్పటికీ ఏమీ పట్టించుకోలేదు బోండా. పైగా తనకు మంత్రి పదవి రాలేదని రాష్ట్రవ్యాప్తంగా కాపు కుల నాయకులు ఆవేదనగా వున్నారనీ చెప్పారు.
పైగా తనను జనసేన పార్టీలోకి రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ పిలిచినా తను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే తిష్ట వేసుకుని కూర్చున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై కాపు నాయకుల్లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకూ ఏ పార్టీకి చెందిన నాయకుడిని తన పార్టీలో చేరాల్సిందిగా పిలవలేదనీ, అలాంటిది బోండా ఉమను ఎలా పిలుస్తారంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమను పిలిపించి చెప్పాల్సింది చెప్పి పంపారట. మరి ఏం చెప్పారో తెలియదు కానీ బోండా ఉమ మాత్రం కిమ్మనకుండా వున్నారు.