కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు - చంద్రబాబు - పవన్ నివాళులు

ఠాగూర్

ఆదివారం, 13 జులై 2025 (16:41 IST)
సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఇందులో అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరిగాయి.
 
తన విలక్షణ నటనతో తెలుగు సినీ ప్రియులకు చేరువైన కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. 
 
కాగా, కోట శ్రీనివాస రావు భౌతిక కాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాస రావు ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. 
 
ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని కోట నివాసంలో ఉంచగా, అక్కడకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‍లు వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కోట కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోట సోదరుడు శంకర రావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు