తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోటకు ప్రత్యేక స్థానం : నందమూరి బాలకృష్ణ

ఠాగూర్

ఆదివారం, 13 జులై 2025 (09:54 IST)
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని ఆయన విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 
 
తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని, ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారనీ, ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు, కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు బాలకృష్ణ పేర్కొన్నారు. 
 
కోట శ్రీనివాస రావు ఇకలేరు... ప్రముఖుల సంతాపం 
 
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూశారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్‌  2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 
 
సినిమాల్లోకి రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేబ్‌ బ్యాంకులో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన (1985), గాయం (1993),  తీర్పు (1994), లిటిల్‌ సోల్జర్స్‌ (1996), గణేష్ (1998), చిన్న (2000), పెళ్లైన కొత్తలో (2006), ఆ నలుగురు (2004), పృథ్వీ నారాయణ (2002) చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 
 
2012లో చిత్రం 'వందే జగద్గురుమ్‌' సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్‌.. వెండి తెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు షించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు