Deepika Padukone, Alia Bhatt, Saipallavi
బాలీవుడ్ నటీమణులు ఈమద్య తెలుగు సినిమాల్లోనుంచి బయటకు వచ్చేస్తున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమాలో ముందుగా దీపికను అనుకొనగా ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ప్రభాస్ తో చేయనని సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టింది. ఇంకోవైపు కల్కి 2 సినిమాను నాగ్ అశ్విన్ ప్రణాళిక సిద్ధంచేశాడు. కానీ, ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్, స్పిరిట్ తోపాటు సలార్ 2 కూడా పైప్ లైన్ లో వుండడంతో డేట్స్ కుదరక కల్కి 2 వాయిదా పడే సూచనలు కనిప్పించాయి. దాంతో తను ప్లాన్ చేసినట్లు ఆర్టిస్టులు ఎంపిక సెట్ కావడంలేదని తెలుస్తోంది.