రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే: సీఎం జగన్

శుక్రవారం, 25 మార్చి 2022 (22:22 IST)
రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని కేంద్రం చెప్పిందని, అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలూ కాపాడతామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

వికేంద్రీకరణే మా విధానం. రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థదే. ఈ విషయంలో సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ చట్టసభకు ఉంది" అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
 
వికేంద్రీకరణ, రాజధాని అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, ఎవరెవరి పరిధి ఏమిటనే విషయాన్ని అందులో చాలా స్పష్టంగా చెప్పారన్నారు. 
 
అలాగే వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గమన్నారు.
 
వికేంద్రీకరణపై కేంద్రం కూడా తమ సమ్మతి తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసిందని చెప్పారు. వికేంద్రీకణ అనేది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్రంగా స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పెరిగిన ధరలను పరిశీలనకు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు