నార్మన్ ఫోస్టర్ డిజైన్లపై సంతృప్తి చెందిన సీఎం చంద్రబాబు

గురువారం, 26 అక్టోబరు 2017 (07:32 IST)
లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ కంపెనీ నార్మన్ ఫోస్టర్ రూపొందించిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ ఆకృతుల(డిజైన్లు)పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన.. పనిలోపనిగా లండన్‌కు వెళ్లి అక్కడ నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండు రోజులపాటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 
 
ఆ తర్వాత ఆర్కిటెక్టులు తయారు చేసి సమర్పించిన ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. హైకోర్టు, శాసనసభ భవంతుల ఆకృతులలో చిన్నచిన్న మార్పులు సూచించిన చంద్రబాబు వీలైనంత వేగంగా నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.
 
కాగా, సచివాలయాన్ని మొత్తం ఐటు టవర్లుగా నిర్మించనున్నారు. ఇందులో మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 టవర్లు ఉండనున్నాయి. 
 
వీటికికొంచెం దూరంగా సీఎం, ముఖ్యమంత్రి కార్యదర్శుల కార్యస్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం తదితర వాటితో మరో టవర్ ఉంటుంది. ఆకృతుల పరిశీలన దాదాపు పూర్తికావడంతో ఇక పనులను వేగిరం చేసేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు