ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ఢిల్లీ బయలేదేరి వెళ్ళారు. ఆయన అక్కడ సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి సంబంధించి వివరణ ఇస్తారు.
రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 11గంటలకు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగే సాగరమాల ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో తీర ప్రాంతం కలిగిన అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఆర్థిక, జలవనరులు, రైల్వే, గ్రామీణాభివృద్ధి, పర్యాటక, చిన్నతరహా పరిశ్రమలు, పౌర విమానయాన శాఖలకు చెందిన మంత్రులు హాజరవుతారు. ఇందులో తీర ప్రాంతాలలో తీసుకోవాల్సి చర్యలపై చర్చ సాగుతుంది. అలాగే అక్కడ చేయాల్సిన పర్యాటక అభివృద్ధి పనులపై చర్చ సాగుతుంది. అలా సమన్వయం కూడా చర్చిస్తారు.