దగ్గుబాటి మారని పార్టీలంటూ లేవు.. లక్ష్మీపార్వతి అందుకే వైసీపీలో?

సోమవారం, 28 జనవరి 2019 (12:31 IST)
ఎన్టీఆర్ అల్లుడు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలు మారడం దగ్గుబాటికి కొత్తేమీ కాదని బాబు ఎద్దేవా చేశారు. 


వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో దగ్గుబాటి భేటీ కావడంతో పాటు టీడీపీ ప్రభుత్వ సొత్తుతో కార్యక్రమాలు జరుపుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు ఏపీ సీం చంద్రబాబు స్పందించారు. తన రాజకీయ జీవితంలో దగ్గుబాటి మారని పార్టీలు లేవని ఆర్ఎస్ఎస్ మొదలు అన్ని పార్టీల చుట్టూ వారి కుటుంబం ప్రదక్షిణలు చేసిందని ఎద్దేవా చేశారు
 
బీజేపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కయ్యిందని ఎద్దేవా చేశారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, తిరిగి అవకాశవాదులంతా నేడు వైసీపీ గూటికి చేరారని దుయ్యబట్టారు.

ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా అని, అభివృద్ధిపై జగన్‌కు ఒక అజెండా అనేది లేదని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రలే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. 
 
మరోవైపు బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, వైసీసీ, టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌తో జగన్ కలయిక బీసీ వ్యతిరేకమని సీఎం అభివర్ణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు