ఏపీ అప్పులపాలు..కానీ రూ.7 కోట్లతో సీఎం, మంత్రులకు కొత్త కార్లు

గురువారం, 4 మార్చి 2021 (09:50 IST)
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేనట్లుంది. ఒకవైపు సొమ్ములు లేవంటూనే సోకులకు తగ్గనంటోంది. ఇప్పుడు ఏకంగా ఏడు కోట్లు పెట్టి ముఖ్యమంత్రి కి, మంత్రులకు కార్లు కొనాలని భావిస్తోంది.
 
ముఖ్యమంత్రి జగన్‌, మరికొందరు మంత్రులు, వీఐపీలకు కొత్త వాహనాలను సమకూర్చాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. మొత్తం 10 వాహనాలకు రూ.6.75 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిసింది.

రూ.3.25 కోట్ల వ్యయంతో ఆయుధాలు ప్రయోగించగల 5 స్కార్పియో వాహనాలు.. రూ.3.50 కోట్ల వ్యయంతో మరింత అధునాతనమైన టాటా హెక్సా ఐదు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది.

మావోయిస్టులతో ముప్పు ఉన్న మంత్రులు, ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఐపీఎస్‌ అధికారులకు ఈ వాహనాల్లో కొన్ని కేటాయించనున్నట్లు సమాచారం.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు