అలాగే, సహకార శాఖ కమిషనర్, ఏపీ డెయిరీ అభివృద్ధి సమాఖ్య ఎండీ, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం జీవీఎస్ ప్రసాద్ ఎన్నికల కమిషన్ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఉన్నారు. వాణీమోహన్ 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.
ఇదిలావుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. హైకోర్టు తీర్పుతో ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టినట్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు.