31-05-2020 నుంచి 06-06-2020 వరకు మీ వార రాశి ఫలితాలు - video

శనివారం, 30 మే 2020 (18:24 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం  
ఈ వారం అనుకూలతలున్నాయి. సన్నిహితుల సలహా పాటిస్తారు. మీ పద్ధతిని మార్చుకుంటారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు
ప్రతికూలతలు అధికం. సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా వుండవు. పరిచయస్తుల మాటతీరు కష్టమనిపిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సంతానం క్షేమం తెలుసుకుంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. కష్టించినా ఫలితం ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. బుధవారం నాడు ఏ పని చేయబుద్ధి కాదు. నిస్తేజానికి లోనవుతారు. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. త్వరలో శుభవార్త వింటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. చేతిలో డబ్బు నిలవదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తొందరగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రియతముల రాక ఉల్లాసం కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. దూర ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. శని, ఆదివారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
అన్ని రంగాల వారికి బాగుంటుంది. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. ముఖ్యమైన పత్రాలు చేతికందుతాయి. సోమ, మంగళవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. దూరాన ఉన్న సంతానం క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు సమస్యలెదురవుతాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ వైఖరిలో మార్పు వస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు రూపొందించుకుంటారు. బుధ, గురువారాల్లో బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఆదాయం సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సంప్రదింపులతో హడావుడిగా వుంటారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శని, ఆదివారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రతి విషయం జ్ఞాపకం వుంచుకోవాలి. పత్రాలు, నగదు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వల్లో జాగ్రత్త. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. సహాయం, సలహాలు ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సోమ, మంగళవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వొద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
పరిస్థితులు అనుకూలిస్తాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. ధనలాభం వుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. బుధ, గురువారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. పెద్దల సలహా పాటించండి. సన్నిహితులను కలుసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ప్రతికూలతలెదురవుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుక్రవారం నాడు బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం వుండదు. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. శని, ఆదివారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. లైసెన్సుల, పర్మిట్ల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు