ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివేక్ యాదవ్ 2008 ఐఏఎస్ బ్యాచుకు చెందినవారు. ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు జిల్లాకు రానున్నారు. 2013-2014 మధ్య వివేక్ యాదవ్ గుంటూరు జాయింట్ కలెక్టర్‌గానూ పని చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఉప కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు.
ఆ తర్వాత వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా, తర్వాత గుంటూరు, శ్రీకాకుళం జేసీగా, విజయనగరంలో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వరిస్తూ.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు మోస్తున్న దినేశ్ కుమార్ నుంచి వివేక్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.