ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లోన్‌యాప్‌ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ యాప్‍ల నిర్వాహకులు ఆగడాలు తట్టుకోలేని అనేక బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారత రిజర్వు బ్యాంకు అనుమతి లేని లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
కాగా, తాజాగా రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి అనే దంపతులు ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసకున్నారు. రుణం తిరిగి చెల్లించకపోవడంతో న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో నాలుగేళ్ల నాగసాయి, రెండేళ్ల లిఖిత శ్రీలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన సీఎం జగన్‌ను తీవ్ర ఆవేదనకు గురించారు. ఈ నేపథ్యంలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.