విద్యుత్ కోతలంటూ వార్తలు రాస్తే పరువు నష్టందావా వేస్తా...

బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మండిపడ్డారు. నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. అయితే, కరెంట్ కోతలతో జనం అల్లాడిపోతున్నట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే పరువు నష్టందావా వేస్తానని హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయానికి 9 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ పత్రికల్లో విద్యుత్ కోతలంటూ వార్తలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ విషయాన్ని పలుమార్లు విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ పదేపదే అలాంటి వార్తలు వస్తున్నాయన్నారు. ప్రజల్లో అపోహలు కలిగించడంతో పాటు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఇలాంటి వారిపై పరువు నష్టందావా వేస్తామని ఆయన హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు