ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైల్డ్ కేర్ సెలవుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ వేదికగా ఓ క్లారిటీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులు తమ చైల్డ్ కేర్ లీవ్‌ను వారి సర్వీసులో ఎపుడైనా వాడుకునే వెసులుబాటును కల్పించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ రెన్యువన్ కాల పరిమితిని మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పొడగించారు.
ఏపీలోని మహిళా ఉద్యోగులకు 180 రోజుల చైల్డ్ కేర్ సెలవు ఉంది. దీన్ని సర్వీస్ కాలంలో ఎపుడైనా ఉపయోగించుకునే వెసులు బాటు కల్పించేందుకు సమ్మతం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్‌ను పిల్లలకు 18 యేళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఉయోగించుకోవాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను ప్రభుత్వం సడలించింది. మహిళా ఉద్యోగులు తమ సర్వీసులో ఈ సెలవును ఎపుడైనా వినియోగించుకోవచ్చని తెలిపారు.