ప్రకాశం జిల్లా ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురైన బాలికను రాష్ట్ర హోంమంత్రి సుచరిత పరామర్శించారు. స్థానిక బాలనగర్ లోని బాలసదన్‌లో ఆశ్రయం పొందుతున్న బాలికతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రికి వివరించారు.