టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తన భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారనీ, ‘హై సెక్యూరిటీ’ జోన్‌లో అసలు డ్రోన్‌ను ఎలా ప్రయోగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుకవున్న వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.