ఆంధ్ర‌ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ శంఖారావం!

సోమవారం, 6 డిశెంబరు 2021 (13:51 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌మ‌కు పి.ఆర్.సి. ని అమ‌లు చేయ‌డం లేదని, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, ఉద్యోగులు స‌మ‌ర శంఖం పూరిస్తున్నారు. ఈ నెల 7 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం ప్రారంభిస్తున్నారు. 
 
 
ఉద్యోగుల సమస్యలపై ఇప్ప‌టికే కరపత్రాలు ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ, 13లక్షల ఉద్యోగులను సమాయత్తపరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు.         

 
2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదని, ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని విద్యాసాగ‌ర్ చెప్పారు. ఏడు పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. డీఏ బకాయులను ఇవ్వని ఏకైక సర్కార్ ఎపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం  ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనను కొనసాగిస్తామని విద్యాసాగర్‌ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు