వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

వరుణ్

బుధవారం, 26 జూన్ 2024 (15:33 IST)
తన అన్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీన చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు, కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వద్ద జగన్మోహన్ రెడ్డి మంతానాలు జరిపినట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 151 సీట్లలో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపా ముగిసిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో జగన్మోహన్ రెడ్డికి అరెస్టుల భయం పట్టుకుంది. ఆయనకు వైకాపా నేతలు ముఖం చాటేస్తున్నారు. 
 
తన సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా వైకాపా నేతలు, కార్యకర్తలు కూడా ఇదేవిధంగా నడుచుకున్నారు. ఈ చర్యలతో జగన్‌లో భయం మరింతగా పెరిగిపోయినట్టు ప్రచారం సాగుతుంది. అందుకే ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి నడవాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో టీడీపీ, జనసేన పార్టీలు అత్యంత కీలకంగా ఉన్నాయి. దీంతో ఆయన ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు కొనసాగాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి దరిమిలా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రతిపాదన చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలపై జగన్ సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. జగన్ రెడ్డి తన సొంత పార్టీ వైకాపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న వార్తలపై షర్మిల స్పందిస్తూ, వైకాపా ఒక పిల్లకాకి... ఎప్పటికైనా అది కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

 

జగన్ రెడ్డి, కాంగ్రెస్ లో విలీనం చేస్తాడు అనే వార్తల పై, స్పందించిన షర్మిల..

వైసీపీ ఒక పిల్ల కాలువ.. ఎప్పటికైనా అది కాంగ్రెస్ లో కలవాల్సిందే అంటున్న షర్మిల.#EndOfYCP #AndhraPradesh pic.twitter.com/BUBxdZoZdS

— anigalla???????? (@anigalla) June 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు