నేడు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం.. విపత్తుల నిర్వహణ సంస్థ

ఠాగూర్

ఆదివారం, 12 మే 2024 (10:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, విశాఖ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
అదేసమయంలో శ్రీ సత్యసాయి, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను కూడా వెల్లడించింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు