తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన మైకులు... ముగిసిన ప్రచారం

సెల్వి

శనివారం, 11 మే 2024 (20:39 IST)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగో విడత పోలింగ్ జరగనున్న పలు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. నాలుగో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. 
 
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు