జగన్ పాలనలో గుండు పన్ను విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు : తులసి రెడ్డి

ఆదివారం, 22 నవంబరు 2020 (16:43 IST)
ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు విధించడం గర్హనీయమన్నారు. జగన్‌ది వడ్డింపుల, వాయింపుల ప్రభుత్వమంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ మద్యం ధరలు పెంచి మద్యంబాబుల రక్తం తాగుతుంది ఏపీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఇసుక, సిమెంట్, పెట్రోల్, సహజ వాయువుల, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు, పౌరసరఫరల రుసంలు పెంచి, కర్రీపాయింట్లపై వృత్తి పన్ను విధిస్తోందన్నారు. 
 
త్వరలో జుట్టు పన్ను, గడ్డం పన్ను, బోడి గుండు పన్ను విధించిన ఆశర్యం లేదని యెద్దేవా చేశారు. ప్రజలకు ప్రభుత్వం ఇస్తుంది గోరంత, ప్రజల వద్ద నుంచి  లాక్కుంటుంది కొండంత అని అన్నారు. ప్రభుత్వ సలహాదారులకు, ప్రకటనలకు కోట్లు ఖర్చుపెట్టే జగన్ కడపలో ఉండే సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రానికి ఏడాదికి 30లక్షలు ఇచ్చే గతి లేదా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు