తొలుత దేవస్థానం క్యూలైన్లు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాబుల వద్ద కాళ్లు, చేతులు శుభ్రం చేసుకొని, శానిటేషన్ వినియోగించిన అనంతరం థర్మల్ స్కానింగ్ చేయించుకుని, రిజిస్టర్లో పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు నమోదు అనంతరం అమ్మవారి దర్శనం చేయించుకున్నారు.
కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ అత్తులూరి అచ్యుతరావు, ఏఈఈవో జంగం శ్రీనివాసరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో అర్చకులకు మాస్క్లు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.