అసని వచ్చేస్తోంది.. హై అలర్ట్‌గా వుండాలి- కంట్రోల్ రూమ్ నెంబర్లివే
బుధవారం, 11 మే 2022 (14:32 IST)
ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలన్నారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని కలెక్టర్లు, అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలను తెరవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
సెంట్రల్ హెల్ప్ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించాలన్నారు.
ఇక విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు హోంమంత్రి తానేటి వనిత.
సహాయక చర్యల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు హోంమంత్రికి తెలిపారు డైరెక్టర్ అంబేద్కర్. మత్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్న హోంమంత్రి తానేటి వనిత. తీరప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.