పురుగుల మందు తాగిన అశ్వారాపుపేట ఎస్ఐ మృతి.. కులం పేరుతో వేధింపులే..?

వరుణ్

ఆదివారం, 7 జులై 2024 (10:52 IST)
Police
పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను (38) మృతి చెందారు. పోలీస్ ఉన్నధికారులు, కిందిస్థాయి సిబ్బంది వేధింపులు, కులవివక్ష వేధింపులను భరించలేని శ్రీరాములు జూన్ 30వ తేదీన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
ఆ సమయంలో ఆయనను గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శ్రీరాములు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
కాగా, తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ఉన్నతాధికారులో కారణమని పేర్కొంటూ ఆయన భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగురాహులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

మీ ఎస్సీలు మారరా అంటూ కులం పేరుతో సీఐ జితేందర్ రెడ్డి నా భర్తను వేదించాడు - ఎస్ఐ శ్రీరాములు భార్య కృష్ణవేణి

కులం పేరుతో సీఐ హింస పెట్టినందుకు అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపిన శ్రీరాములు బార్య, అక్క

TeluguScribe Exclusive https://t.co/d3ktKuvZ1N pic.twitter.com/att4UedLbL

— Telugu Scribe (@TeluguScribe) July 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు