ఫైనాన్స్ వ్యవహారం హత్యకు దారి తీసింది. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెట్టి లింగయ్య అనే వ్యక్తి గుంటూరు జిల్లా కారంపొడిలోని లక్ష్మీగణపతి ఆటో ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నాడు. రుణం రికవరీ కోసం ఫైనాన్స్ గుమస్త అయిన శివ (26) తరచు ఫోన్ చేసి వాయిదా చెల్లించమని అడిగేవాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య విబేధాలు పెరిగాయి.