అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలుజారీచేసింది. కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అసత్య వార్తలను, రెచ్చగొట్టే ప్రకటనలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, జాతీయ భద్రతా చట్టం కింద కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు.
రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్ మీడియాపై నిఘా ప్రారంభమైందని తెలిపారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తామన్నారు.