తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఆలయంలోని యాగశాలలో డిసెంబరు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
క్షేత్ర ప్రాశస్త్యం :
వేంకటాచలక్షేత్రంలోని తొలిదైవం శ్రీ ఆదివరాహస్వామి. ఈయన్నే 'శ్వేత వరాహస్వామి' అంటారు. క్షేత్రసంప్రదాయం ప్రకారం 'తొలిపూజ, తొలి నైవేద్యం, తొలిదర్శనం' జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వరుని దర్శించడం ఆచారం.