తిరుపతి విమానాశ్రయంలో పరుగులు పెట్టిన బండ్ల గణేష్... బ్లేడు బండ్లా అంటూ...

సోమవారం, 17 డిశెంబరు 2018 (20:21 IST)
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత బండ్ల గణేష్. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమని జోస్యం చెప్పారాయన. అయితే ఈ నెల 11వ తేదీన జరిగిన కౌంటింగ్‌లో కారు వేగానికి కాంగ్రెస్ హస్తం జావగారిపోయింది. దీంతో అప్పటి నుంచి బండ్ల గణేష్ మీడియాకు కనిపించకుండా తిరుగుతున్నారు. తన ఇంటిలోనే కాకుండా తన సన్నిహితులు ఇంటిలో కూడా లేకుండా ఒక రహస్య ప్రదేశాన్ని ఎంచుకుని దాక్కున్నారు.
 
అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు బండ్ల గణేష్. కుటుంబ సమేతంగా ఆయన తిరుపతికి వచ్చారు. బండ్ల గణేష్‌ను చూసిన టాక్సీ డ్రైవర్లు బ్లేడ్ ఎక్కడ అంటూ గట్టిగా అరిచారు. దీంతో గణేష్ ముఖంలో ఆందోళనకర వాతావరణం కనిపించింది. పరుగెత్తికెళ్ళి కారులో కూర్చున్నారు బండ్ల గణేష్. వైకుంఠ ఏకాదశి కావడంతో రేపు తిరుమల శ్రీవారిని బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా దర్శించుకునే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు