గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏలూరితో టీడీపీ అధిష్టానం నేతలు మాట్లాడినట్టు తెలుస్తోంది. టీడీపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఏలూరి మాత్రం ప్రస్తుతం వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని.. కొద్దిరోజుల తరువాత మాట్లాడి ఏ విషయం చెబుతానని అన్నట్టు తెలుస్తోంది.
కాగా 2014 లో ఎమ్మెల్యేగానూ, 2017 లో ఎమ్మెల్సీగాను పోటీ చేశారు. 2019 లో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన ఏలూరి.. ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తరువాత కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఏలూరి.. కొంతకాలంగా పార్టీకి సంబంధించిన పోస్టులు పెట్టడం లేదు.