మద్యం సొమ్ము వైకాపా నేతల జేబుల్లోకి.. సీబీఐ విచారణకు ఆదేశించండి : పురంధేశ్వరి

సోమవారం, 9 అక్టోబరు 2023 (08:58 IST)
ఏపీలో జరుగుతున్న మద్యం విక్రయాల సమకూరే ఆదాయం అధికార వైకాపా నేతల జేబుల్లోకి వెళుతుందని, అందువల్ల లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు వినతిపత్రం అందజేశారు. ఏపీలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నారు. క్యాష్ అండా క్యారీ విధానంలో భారీ అవినీతి చోటు చేసుకుంటుందని గుర్తు చేశారు. ఇదే విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వినతిపత్రం కూడా సమర్పించారు. 
 
ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నరేళ్లుగా మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. ఏపీలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వినతిపత్రం సమర్పించారు.
 
రాష్ట్రంలో మద్యం విక్రయాల సొమ్ము భారీ మొత్తంలో అనధికారికంగా వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోందని పురంధేశ్వరి ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ఓ లిక్కర్ షాపులో విక్రయాలను పరిశీలిస్తే... ఒక లక్ష రూపాయలకు మద్యం విక్రయించగా, కేవలం రూ.700కి మాత్రమే డిజిటల్ చెల్లింపులు జరిగినట్టు వెల్లడైందని తెలిపారు.
 
క్యాష్ అండ్ క్యారీ విధానంతో ఏపీ లిక్కర్ విధానంలో భారీ అవినీతి జరుగుతోందని, ప్రధానంగా చీప్ లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటూ ఉచితాలు ఇస్తున్నామని చెప్పుకోవడం హేయమని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు