ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అధికార వ్యవస్థ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారిపోయిందని దుయ్యబట్టారు. విద్య, ఆరోగ్యాన్ని వదిలేసి రాజధానిపై అనవసర చర్చ జరుగుతోందని సోమువీర్రాజు తప్పుబట్టారు.
అలాగే, స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మటానికి వీల్లేదన్నారు. కాగా, సోమవారం ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలుసుకోనున్నారు. ప్రైవేటీకరణ, తిరుపతి ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.