కృష్ణంరాజు పార్థివదేహంపై బీజేపీ జెండా.. నివాళులు అర్పించిన నేతలు

సోమవారం, 12 సెప్టెంబరు 2022 (12:56 IST)
సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. అయితే, ఆయన ఒక సినీ నటుడుగానే కాకుండా రాజకీయ నేతగా ఉన్నారు. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలకు సహాయ మంత్రిగా పని చేశారు. ఈయన బీజేపీ నేత కూడా. దీంతో ఆయన పార్థివదేహంపై బీజేపీ పతాకాన్ని కప్పారు. 
 
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు కలిసి జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్ళి తమ నేత భౌతిక కాయంపై బీజేపీ జెండా ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కృష్ణంరాజు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణువర్థన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
కాగా, కృష్ణంరాజు 1998లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలో దిగి మరోసారి ఎంపీగా ఘనవిజయం అందుకున్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయనను అప్పటి బీజేపీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని కేంద్ర సహాయ మంత్రిగా నియమించింది. 


 

పార్టీ జాతీయనేత , మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి పార్థివ దేహానికి పార్టీ రాష్ట్ర నేతలతో కలసి ఈరోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో పార్టీ పతాకంతో నివాళులను అర్పించడం జరిగింది .@BJP4Andhra @PrabhasRaju #KrishnamRaju #BJP pic.twitter.com/Uo1xsefaIH

— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 12, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు