ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయిందన్నారు. కృష్ణంరాజు తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఒక ఆత్మీయుడుని కోల్పోయామని, ఆయన నుంచి మంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.
అలాగే, హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. 50 యేళ్లుగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. సినీ రంగంపై తనదైన ముద్రవేసారని కీర్తించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.