తిరుమలేశుని సేవలో ఏళ్ళ తరబడి తరించి, చివరికి ఆయన సేవకు విశాఖకు వచ్చి, కార్తీక దీపోత్సవం నేపథ్యంలో హఠాన్మరణం చెందిన డాలర్ శేషాద్రికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతిలో నేడు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు జరుగనున్నాయి.
నేడు తిరుపతికి సుప్రీంకోర్టు సీజే ఎన్.వి.రమణ రానున్నారు. ఆయన డాలర్ శేషాద్రి పార్థీవ దేహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ ఉదయమే డాలర్ శేషాద్రి స్వామి పార్ధీవ దేహానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కన్నీటి నివాళ్ళర్పించారు. తిరుపతిలోని డాలర్ శేషాద్రి స్వామి నివాసం వద్దకు చేరుకుని పూలమాల వేసి, పాదాలకు నమస్కరించారు. శేషాద్రి స్వామి పార్ధీవ దేహాన్ని తదేకంగా చూస్తూ , కంట తడి పెట్టారు. డాలర్ శేషాద్రి స్వామి సతీమణిని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పరామర్శించారు.