కాకినాడ తీరంలో బోటు ప్రమాదం... పేలిన సిలిండర్లు... బోటు దగ్ధం...

శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:45 IST)
కాకినాడ తీరంలో బోటు ప్రమాదం సంభవించింది. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తీరానికి తిరిగి వస్తుండగా, బోటులోని సిలిండర్లు ఉన్నట్టుండి పేలిపోయాయి. దీంతో బోటు పూర్తిగా దగ్ధమైపోయింది. ఫలితంగా 80 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది.
 
కాకినాడ తీర ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు వారం రోజుల క్రితం చేపలవేటకు వెళ్ళారు. తాజాగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమయ్యారు. 
 
ఈ జాలర్లు మరో నాలుగు గంటల్లో తీరానికి చేరుకుంటుందనగా శుక్రవారం తెల్లవారుజామున సిలిండర్ పేలి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. 
 
దీంతో అప్రమత్తమైన జాలర్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షణ దళం సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. బోటులోని 12 మంది జాలర్లను రక్షించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు