కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

ఠాగూర్

మంగళవారం, 6 మే 2025 (09:08 IST)
కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నచందంగా గత ఎన్నికల్లో వైకాపా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వైకాపా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదన్నారు.
 
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి పాలన సాగించారన్నారు. కానీ, చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి 11 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రజలు గమనించాలని చెప్పారు. మూడు టీవీ ఛానళ్లు, మూడు పేపర్లతో చంద్రబాబు పప్పం గడుపుతున్నారని విమర్శించారు. 
 
కూటమి ప్రభుత్వం యేడాది కాలంలో రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. మళ్లీ పెళ్లి అన్నట్టుగా అమరావతి పనులు పునఃప్రారంభం చేశారని ఎద్దేవా చేశారు. అమరావతికి వచ్చిన మోడీ ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కూటమి నేతల ప్రచార పిచ్చితో సింహాచలం ఆలయం వద్ద ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వం హత్యలేని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు