అక్కకు వల.. రహస్యంగా పెళ్లి.. తర్వాత చెల్లిపై అత్యాచారం.. క్యాబ్ డ్రైవర్ ఘాతుకం

సోమవారం, 18 నవంబరు 2019 (09:01 IST)
విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలంలో ఓ క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత అక్కకు వల వేసి ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పిమ్మట ఆమె చెల్లిపై కన్నేసి... ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ బాధిత ఇద్దరు బాలికలు ఆ క్యాబ్ డ్రైవర్‌ను బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ వచ్చారు. ఇదే వారిపాలిట శాపంగా మారింది. ఫలితంగా క్యాబ్ డ్రైవర్ చేతిలో వారిద్దరూ మోసపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా పెందుర్తిలో నివసిస్తున్న అరవింద్‌(35) క్యాబ్‌ డ్రైవర్‌. పక్క ఇంట్లో ఓ మహిళ తన ఇద్దరు మైనర్‌ కుమార్తెలతో నివాసం ఉంటోంది. అరవింద్‌ను బాలికలు బాబాయ్‌ అని పిలిచేవారు. పెద్దమ్మాయి (15) 9వ తరగతి, చిన్నమ్మాయి(13) 8వ తరగతి చదువుతున్నారు.
 
అరవింద్‌ తన క్యాబ్‌లోనే రోజూ పాఠశాలకు తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో పెద్దమ్మాయికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సుమారు 4 నెలల క్రితం సింహాచలం తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చిన్నామ్మాయిని కూడా లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. 
 
అరవింద్‌ భార్య అతన్ని నిలదీయడంతో బాలికలతో పరారయ్యాడు. భార్య, బాలికల తల్లి ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని ఒంగోలులో అరెస్టు చేశారు. అతనితోపాటు ఉన్న బాలికలను కూడా పెందుర్తి తీసుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు