విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లి కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందని, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలో కేటాయించాల్సి ఉందన్నారు. కాగా జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇప్పటికే కేసుల విచారణను జాప్యం చేస్తున్నారని, వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే.. మరింత ఆలస్యం జరుగుతుందని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానులేనని, సీఎం అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ వాదించింది.