సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమా?

మంగళవారం, 1 జూన్ 2021 (07:36 IST)
అనేక అక్రమ కేసుల్లో చిక్కుకుని బెయిల్‌పై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. ఆయన బెయిల్‌ను రద్దు చేసే విషయంపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకోనుంది.  
 
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సీబీఐ కోర్టు విచారించనుంది. పిటీషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. 
 
దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో జగన్ , సీబీఐ ఈరోజు కౌంటర్ దాఖలు చేయనుంది. కౌంటర్‌పై నేడు సీబీఐ కోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఇరు వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు