గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో భూకొనుగోళ్లలో భారీగా అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయంటూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
రాజధానిపై తమ వాళ్లకు ముందస్తు లీకులు ఇవ్వడంతో 2014 జూన్ నుంచి డిసెంబర్‌లోపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే.