స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సీబీఐకు అప్పగించేలా ఆదేశించండి : హైకోర్టులో ఉండవల్లి

శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (14:52 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టయివున్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు వీలుగా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 
 
ఈ కేసులోని ఆర్థిక అంశాలు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయని, అందువల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా, వ్యక్తులు కూడా నిందితులుగా ఉండటం వల్ల కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కోరారు.
 
ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్ టెక్ సంస్థ, సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు