71 ఏళ్ళ వ‌య‌సులో... డాక్టర్లు వద్దన్నా...బాబు దీక్ష‌...అసామాన్యం!

శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:35 IST)
రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేయడం అసామాన్యం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. మంగ‌ళ‌గిరిలో చంద్ర బాబు దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఆమె మాట్టాడుతూ, 71 ఏళ్ళ వ‌య‌సులో డాక్టర్లు వద్దన్నా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేస్తున్నార‌ని చంద్ర‌బాబుకు కితాబు ఇచ్చారు. జగన్ రెడ్డి , ఆయన బూతుల‌ మంత్రివర్గం రాష్ట్రాన్ని అధోగతి పట్టించార‌న్నారు. 
 
ప్రణాళికబద్ధంగా వైసీపీ ప్రభుత్వం దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడులు చేయించడం దుర్మార్గం అని, ఇది ముమ్మాటికీ  పిరికి పందల చర్య అన్నారు. విచక్షణ రహితంగా పార్టీ కార్యాలయంలో సిబ్బందిపై , కర్రలు, సుత్తి తో కొట్టి, రక్తం కారుతూ ఉంటే అది చూస్తూ పైశాచిక ఆనందం పొందే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. డ్రగ్స్ రవాణా చేస్తూ జగయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే కొడుకును తెలంగాణా పోలీసలు రెడ్ హ్యడెండ్ గా పట్టుకున్నార‌ని, అది నిజం కాదా అని కాట్రగడ్డ ప్రసూన ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్ముతున్నవారు జగన్ రెడ్డి అనుచరులు అని ఆంధ్రప్రదేశ్ అంతా కోడైకూస్తుంద‌ని, అందుకే నిన్న పట్టాభి ప్రెస్సుమీట్ పెట్టగానే ఉలిక్కిపడి దాడులు చేశార‌న్నారు.
 
నిజంగా మీకు సంబంధం లేకపోతే మీరు, మీ బూతుల మంత్రుల బృందం కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి గాని, దాడులు సరైన విధానం కాద‌న్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారికి భవిష్యత్తులో వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెప్పారు. మా ఓర్పును చేతగానితనంగా తీసుకోవద్దు. ఓర్పు. సహనాన్ని మాకు చంద్రబాబు నాయుడు నేర్పారు. కానీ అటువంటి చంద్రబాబు నాయుడు గారే సహనం కోల్పోయారు అంటే చూడండి... మీ పరిపాలనతో ఎంత విసిగిపోయమో.. కచ్చితంగా ఇంకా రెండు  సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం...లెక్కలు అన్నీ ఇచేస్తాం...అని పేర్కొన్నారు.
 
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి , ఆస్తులపై దాడులు , గొడవలు ప్రోత్సహించడం సమంజసమా?  దాడులు చేసేది వైసీపీ వాళ్లే...కేసులు పెట్టించేది వైసీపీ వాళ్లే..పోలీసు వ్యవస్థ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.. రాబోయే రోజుల్లో వీటి అన్నిటిపై కోర్టులు జ్యోక్యం చేసుకుంటే ప్రభుత్వం, పోలీసు అధికారులు చట్టం ముందు  మొకరిల్లక తప్పదు... డీజీపీ గారు మీరు కూడా ఆలోచించండి ..ప్రభుత్వం శాశ్వ‌తం కాదు... ఉన్నత విద్య అభ్యసించి మంచి స్థాయిలో ఉన్న మీరు ఇలా 30 కేసులు ఉన్న ముఖ్యమంత్రికి వత్తాసు పలకడం సరైన విధానం కాద‌న్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు