Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

చిత్రాసేన్

గురువారం, 30 అక్టోబరు 2025 (15:07 IST)
Rahul Ravindran
నేను అసిట్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో హీరోగా అవకాశం వచ్చింది. పరిచయాలు పెరుగుతాయి కదా అని హీరోగా నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్ రైటింగ్ సైడే ఉండేది. ఇప్పుడు కూడా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. అయితే హీరోగా నటించడం అంటే ఒక కమిట్ మెంట్ ఉండాలి. దాదాపు ఏడాది పాటు ఆ సినిమాకే టైమ్ కేటాయించాలి అని రాహుల్ రవీంద్రన్ అన్నారు.
 
ఆయన దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేశాడు. అది నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ  సందర్భంగా తన కెరీర్ గురించి ఇలా వివరించారు. 
 
నేను డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ చేసినప్పుడే హీరోగా వద్దు అనుకున్నా. నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ డైరెక్షన్ అనేది నా కెరీర్ గా భావిస్తా. 20 రోజుల కాల్షీట్ ఉండే క్యారెక్టర్స్ అయితే ఒప్పుకుంటున్నా. ఆ దర్శకుడి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అనేది కూడా నా మైండ్ లో ఉంటుంది. సుజిత్ నా ఫ్రెండ్, ఓజీలో ఆయన చెప్పగానే నటించాను. హను రాఘవపూడి తన మూవీకి పిలిస్తే తప్పకుండా వెళ్తా. ఆయన ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు. ఇంకా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. హను తన నెక్ట్స్ మూవీలో హీరోగా నటించమని అడిగితే మాత్రం నటిస్తా.
 
- నెక్ట్స్ నేను డైరెక్ట్ చేయబోయో రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ రెండు సినిమాల తర్వాత రశ్మిక నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్ గా రశ్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సిఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు