మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నావా అని బాబు గారు అడిగారు: నారా లోకేష్

గురువారం, 28 డిశెంబరు 2023 (13:44 IST)
తెలుగుదేశం పార్టీ యువనేత ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో భేటీ అవుతున్నారు. దాదాపుగా నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో పర్యటించనున్నారు. మంగళగిరిలో పర్యటిస్తున్న సందర్భంలో సోషల్ మీడియాలో నారా లోకేష్ ప్రసంగం వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో నారా లోకేష్ మాట్లాడుతూ.. '' 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గం అది. అందుకే అక్కడి నుంచే పోటీ చేసి గెలవాలని భావించి బరిలోకి దిగాను.
 
21 రోజుల్లో మంగళగిరి ప్రజలు కష్టాలేమిటో తెలుసుకోలేకపోయాను. అలాగే లోకేష్ ఏమిటో మంగళగిరి ప్రజలకు తెలియలేదు. ఓటమి చెందిన తర్వాత కూడా పక్క నియోజకవర్గానికి పారిపోలేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలన్న లక్ష్యంతో మంగళగిరి కోసం కష్టపడ్డా. నాలుగున్నరేళ్లుగా మంగళగిరి ప్రజల బాగోగుల కోసం కష్టపడ్డాను. ఈ కాలంలో ఎందరో నన్ను ఎగతాళి చేసారు.
 

ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలనే లక్ష్యంతో పని చేశాను...

మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు @naralokesh pic.twitter.com/bw4IjRNAfW

— Team Lokesh (@Srinu_LokeshIst) December 27, 2023
నేనేమీ బాధపడలేదు, కష్టపడలేదు. మంగళగిరి ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా. మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నావా అని బాబు గారు నన్ను అడిగారు. నేను ఒక్కటే చెప్పాను. మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు. ఆ కసితో మంగళగిరి కోసం పనిచేస్తానని చెప్పాను.'' అని అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు