జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నా.. చంద్రబాబు

శుక్రవారం, 26 జులై 2019 (14:29 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషపై తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అంటే హుందాతనంగా వ్యవహరించాలని, వాడే భాష పద్ధతిగా ఉండాలనీ, అంతేకాని నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని, మాట్టాడేటప్పుడు జగన్ ఒళ్లు దర్గర పెట్టుకోవాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
 
తనను వైఎస్ ఎంత ఎగతాళి చేసినా నేను చాలా హుందాగా వ్యవహరించానని అన్నారు చంద్రబాబు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి వారు గతంలో ఇదే తీరుగా మాట్లాడితే వారికి వార్నింగ్ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు వైఎస్ జగన్‌ను కూడా హెచ్చరిస్తున్నా.. చిల్లరతనంతో చీప్‌గా మాట్లాడొద్దు... ముఖ్యమంత్రి కుర్చీకి విలువ ఇవ్వాలి అని సూచించారు. మరోవైపు, ప్రతీరోజూ అసెంబ్లీలో పులివెందుల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు చంద్రబాబు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు