ప్రత్యేక హోదా కోసం పవన్ పదేపదే నిరసన గళం వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వైజాగ్ ఆర్కే బీచ్‌లో గురువారం విద్యార్థులు, యువత తలపెట్టిన మౌన దీక్షకు పవన్ బహిరంగ మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలు, మంత్రులంతా కలిసి జనసేనానిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
వీటిపై చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి.. అతణ్ణి అనవసరంగా హీరోని చెయ్యవద్దని.. సుజనా, ముద్దుకృష్ణమ, బోండా ఉమా వంటి అనేక మంది నేతలకు సూచించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కి మీడియాలో ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చిందని.. అందువల్ల ఆచితూచి అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.