ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బాగల్

ఆదివారం, 16 డిశెంబరు 2018 (14:36 IST)
ఛత్తీస్‌గఢ్ కొత్త మఖ్యమంత్రిగా భూపేష్ బాగల్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే, ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా వెల్లడించాల్సివుంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
 
ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైన భూపేష్ బాగల్‌‌ను ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఎంపిక చేసింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల మీద క్లారిటీ వచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ రేపు ప్రమాణం చేస్తున్నారు. 
 
ఇక మిగిలింది ఛత్తీస్‌గఢ్ ఒక్కటే. దానిపై కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు చర్చలు జరిపింది. కాంగ్రెస్ నేతలు భూపేష్ బాగల్, కాంగ్రెస్ సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్ కూడా ముఖ్యమంత్రి రేసులో నిలిచారు. అయితే, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భూపేష్ బాగల్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఈయన సోమవారం ప్రమాణం చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు