మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కమల్‌నాథ్‌కే.. రాజస్థాన్ ఎవరికో?

శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:30 IST)
సస్పెన్స్‌కు తెరపడింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కమల్‌నాథ్‌ ఎంపికయ్యారు. సీఎం రేసులో చివరివరకు పోటీలో నిలచిన యువనేత జ్యోతిరాదిత్య సింథియాకు చుక్కెదురైంది. అనుభవంతో పాటు యువతరం మధ్య జరిగిన రసవత్తర పోరులో కాంగ్రెస్ అధిష్టానం అనుభవానికే పెద్దపీట వేసింది. 
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం కమల్‌నాథ్, యువనేత జ్యోతిరాధిత్య సింథియాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం రోజంతా తీవ్ర తర్జన భర్జనల తర్వాత ఎంపీ సీఎంగా కమల్‌నాథ్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి భోపాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధిష్టాన పరిశీలకులుగా సీనియర్లు ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, శోభా ఓజా తదితరులు పాల్గొన్నారు. 
 
సీఎల్పీ భేటీ తర్వాత కమల్‌నాథ్ పేరును మధ్యప్రదేశ్ సీఎంగా అధికారికంగా ప్రకటించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం కూడా ఎవరూ ఉండబోరని స్పష్టంచేసింది. మొన్నటి ఎన్నికల్లో చింద్వారా నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ పోటీచేసి గెలిచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు